కన్నీళ్లు తుడిచే నేత కోసం కదిలొచ్చిన కోనసీమ
సాక్షి, కాకినాడ: కన్నీళ్లు తుడిచే నేతను చూసేందుకు కోనసీమ తరలివచ్చింది. తమ కడగండ్లు తీర్చే దైవాన్ని దర్శించుకునేందుకు గంగపుత్రులు బారులు తీరారు. నీరా'జనాలు' పలికారు. తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. సంక్షేమ పథకాల రూపంలో తమకు భరోసా ఇచ్చే ప్రసంగానికి కరతాళ ధ్వనులు, ఈలలతో కృతజ్ఞతలు చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకార గ్రామమైన కొమానపల్లి జనంతో కిక్కిరిసిపోయింది. బహిరంగ సభా స్థలి వద్ద జన సునామీ ఏర్పడింది. ఇసుకేస్తే రాలనంతగా ఎక్కడ చూసినా జనమే. సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది.